![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -717 లో.... దీప, కార్తీక్ ల దగ్గరికి సూరజ్ వస్తాడు. రేపు ఆఫీస్ కి రెండు గంటలు లేట్ గా వస్తానని అంటాడు. నీకు ఎవరు లేరన్నావ్ కదా బ్రో.. ఎవరిని కలవడానికి వెళ్తున్నావని కార్తీక్ అడుగుతాడు. అవన్నీ ఎలా చెప్పుకుంటారు బ్రో అని సూరజ్ అంటాడు. ఏం పర్లేదు చెప్పమని కార్తీక్ అనగానే శనీశ్వరుడిని కలవడానికి వెళ్తున్నాను.. నేను ఒకమ్మాయిని ఇష్టపడుతున్నాను.. పెళ్లి జరగాలంటే కొంచెం దోషం ఉందట.. అందుకే గుడికి వెళ్తున్నాను.. దోషం అలాగే ఉంటే పెళ్లి అయిన వాళ్ళ వ్యామొహం కలుగుతుందట అని జ్యోత్స్నని ఉద్దేశ్శించి సూరజ్ చెప్తాడు. దాంతో సుమిత్ర రేపు జ్యోత్స్న ని తీసుకొని మనం కూడా గుడికి వెళదామని శివన్నారాయణ అంటాడు.
అదంతా కావాలనే చేసాడని జ్యోత్స్న అనుకుంటుంది. మరి రివెంజ్ తీర్చుకోవాలి కదా అని సూరజ్ అనుకుంటాడు. కార్తీక్, దీప వెళ్తుంటే ఇక్కడే భోజనం చెయ్యండి అని శివన్నారాయణ అంటాడు. సూరజ్ నువ్వు ఇక్కడే భోజనం చేయ్ అని చెప్తాడు. మరొకవైపు మాలిని దగ్గరికి బాలా వస్తాడు. మేడమ్ నేను రెస్టారెంట్ ఇవ్వనని చెప్పినందుకు నా చెఫ్స్ అందరిని కొనేసారని కోప్పడతాడు. అప్పడే రెస్టారెంట్ పై దాడి జరుగుతుందని బాలాకి ఫోన్ వస్తుంది. దాంతో తనకి ఎదురు నిలబడి ఉండలేక రెస్టారెంట్ ని తనకి అమ్మడానికి సిద్ధమవుతాడు. అదే సమయంలో దక్షిణామూర్తి వస్తాడు. ఎవరు అమ్మ అతను అని మాలినిని దక్షిణామూర్తి అడుగుతాడు. రెస్టారెంట్ ఓనర్ మావయ్య, మనకి తన రెస్టారెంట్ అమ్ముతున్నాడని చెప్తుంది. సరే అని అనేసి అతను లోపలికి వెళ్తాడు. అన్ని విషయాలు మీకు చెప్పొద్దూ మావయ్య అని మాలిని అనుకుంటుంది. ఇప్పుడే యుద్ధానికి అన్ని సిద్ధం చేస్తున్నా అని మాలిని అనుకుంటుంది.
ఆ తర్వాత అందరు భోజనం చేస్తారు. దీప, సూరజ్ తో కలిసి భోజనం చెయ్యడం జ్యోత్స్నకి నచ్చదు. దాంతో నేను వడ్డిస్తానని చెప్పి సూరజ్ పై పప్పు పడేలా చేస్తుంది జ్యోత్స్న. అయ్యో సారీ సూరజ్ అని జ్యోత్స్న చెప్తుంది. జ్యోత్స్నని ఎవరు ఏం అనకముందే.. మీరేం అనకండి.. జ్యోత్స్న గారు ఏం కావాలని వీళ్ళ తో కలిసి భోజనం చెయ్యడం ఏంటని అనుకొని ఇలా ఏం చెయ్యలేదు.. దీప గారి సక్సెస్ కి కారణం నేను అని ఇలా ఏం చెయ్యలేదని సూరజ్ అంటాడు. ఒరేయ్ అంతా చెప్పేశావ్ కదరా అని జ్యోత్స్న అనుకుంటుంది. నువ్వు షర్ట్ మార్చుకొని రా అని శివన్నారాయణ అంటాడు. సరే అని సూరజ్ వెళ్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటుంటే సూరజ్ వీడియో కాల్ చేసి జ్యోత్స్నది కాస్ట్లీ చీరని చూపిస్తూ నువ్వు ఇప్పుడు వచ్చి షర్ట్ ఉతికేస్తే సరే లేదంటే ఈ చీరని కాల్చేస్తానని సూరజ్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |